గోదావరికి జగన్ ప్రత్యేక పూజలు

12 June, 2018 - 11:53 AM

(న్యూవేవ్స్ డెస్క్)

కొవ్వూరు (పశ్చిమ గోదావరి జిల్లా): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైస్‌ జగన్మోహన్‌ రెడ్డి కొవ్వూరులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం గోష్పాద క్షేత్రాన్ని సందర్శంచారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆధ్వర్యంలో గోదారమ్మకు జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జగన్‌కు సంప్రదాయ స్వాగతం పలికిన గోష్పాద క్షేత్రం వేద పండితులు, వేద మంత్రాలు చదువుతుండగా, నదీమతల్లికి జగన్ హారతినిచ్చారు. అనంతరం ఆలయాన్ని దర్శించుకొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వైఎస్‌ జగన్‌‌ను ఆశీర్వదించారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్‌ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, ప.గో.జిల్లా నేతలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ప్రజా సంకల్ప యాత్రను మంగళవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలో ముగించుకుని, తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టేందుకు బయలుదేరే ముందు గోష్పాద క్షేత్రాన్ని సందర్శించారు.