ఆస్తి వివాదం: అన్నను నరికిన తమ్ముడు

23 June, 2018 - 12:07 PM

(న్యూవేవ్స్ డెస్క్)

గుంటూరు: ఆస్తి వివాదం ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. ఆస్తి విషయంలో అన్నను చంపేశాడు ఓ తమ్ముడు. ఈ ఘటన శనివారం గుంటూరు జిల్లా గొల్లపల్లి మండలం గరికపాడులో జరిగింది.

కొద్ది రోజులుగా అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే మరోసారి ఆస్తి విషయం మాట్లాడుకుంటున్నారు. వారి మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ నేపథ్యలో అన్న గోపాల్‌‌ను తమ్ముడు గొడ్డలితో నరికాడు. దీంతో గోపాల్ రక్తపు మడుగులో అక్కడిక్కడే మృతి చెందాడు.

ఈ సంఘటనతో గరికపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.