ఎలుగుబంటి దాడిలో మహిళ మృతి

10 June, 2018 - 12:01 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సోంపేట: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాంలో ఆదివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో గ్రామస్తులపై విరుచుకుపడి ఏడుగురిని తీవ్రంగా గాయపరిచి బీభత్సం సృష్టించింది. కొబ్బరితోటలో చెత్త పారవేసేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారందరినీ పలాస ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఊర్మిళ (40) అనే మహిళ మృతిచెందింది. ఆమె భర్త తిరుపతిరావు సహా మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ముగ్గురినీ మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్‌)కి తరలించారు. మరో ముగ్గురు పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎలుగుబంటి సమాచారం అటవీశాఖ అధికారులకు చెప్పినా ఎవరూ స్పందించలేదని ఎర్రముక్కాం గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎలుగుబంటిని కొట్టి చంపారు. ఎలుగుబంట్ల సంచారంతో ఎర్రముక్కాం గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు.