ఆ అమ్మడి శీలం రూ.10 కోట్లు!

01 October, 2019 - 9:32 PM

 (న్యూవేవ్స్ డెస్క్)

లండన్‌: ఓ 24 ఏళ్ళ అమ్మాయి తన శీలాన్ని ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టింది. ఆమె శీలాన్ని విద్యావంతుడైన 50 ఏళ్ళ ఓ ఎంపీ 1.3 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.10 కోట్లు)కు కొనుక్కున్నాడు. ఈ సంఘటన ఎక్కడో కాదు.. రవి అస్తమించని సామ్రాజ్యం అని సగర్వంగా చెప్పుకునే బ్రిటన్‌లో జరిగిందీ సంఘటన. విషయం ఏంటంటే.. బ్రిటన్‌కు చెందిన 24 ఏళ్ల లియా అనే యువతి ఇటీవల తన శీలాన్ని 50వ దశకంలో ఉన్న ‘టోరీ ఎంపీ (బ్రిటన్‌ కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన పార్లమెంట్‌ సభ్యుడు)’కి 1.3 మిలియన్‌ పౌండ్లకు విక్రయించినట్లు వెల్లడించింది. ‘సిండరిల్లా ఎస్కార్ట్స్‌’ వెబ్‌సైట్‌ ద్వారా తన శీలాన్ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టగా మంచి ధరతో ఆ టోరీ ఎంపీ ముందుకు వచ్చారని, ఆయనతో రెండు నెలల పాటు డేటింగ్‌ చేసిన తర్వాత, తన కన్యత్వాన్ని అర్పించానని లియా తెలిపింది. తన తల్లి అనుమతితోనే తాను తన శీలాన్ని అమ్ముకున్నానని, ప్రేమించి మోసపోయేకన్నా ఇలా డబ్బులకు కన్యాత్వాన్ని అమ్ముకోవడం మంచిదంటూ తన అమ్మ ఇచ్చిన సలహా తనకు ఎంతో నచ్చిందని లియా తెలిపింది.

కన్యాత్వాన్ని పోగొట్టుకున్న తర్వాత తనకు ఎంతో స్వేచ్ఛ లభించిందనే భావన కలిగిందని, గుండెల మీది నుంచి ఎంతో భారం దిగిపోయినట్లు కూడా అనిపించిందని లియా హుషారుగా చెప్పింది. తన శీలం వేలం ద్వారా వచ్చిన డబ్బుతో తాను లండన్‌కు సమీపంలో ఓ ఇంటిని కొంటున్నానని, మిగిలిన డబ్బుతో ‘ప్రాపర్టీ బిజినెస్‌’ చేయాలనుకుంటున్నానని లియా తెలిపింది. తాను కన్యాత్వాన్ని అర్పించిన వ్యక్తి మంచి మర్యాదస్తుడని, బాగా చదువుకున్నవాడని, ఆయనకు లండన్‌లో మంచి పరిచయాలు ఉన్నాయని, అలాంటి వ్యక్తితో గడపడం ఓ మంచి అనుభవం అని లియా ‘ఫిమేల్‌’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఎవరో తెలియని వ్యక్తితో ఏకాంతంగా గడిపి ఆశాభంగం పొందే కన్నా ఈ అనుభవం తనకు బాగా అనిపించిందని లియా చెప్పింది. తాను కన్యాత్వాన్ని ఎందుకు అమ్ముకోవాలనుకుందో ‘సిండ్రిల్లా ఎస్కార్ట్స్‌’కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో లియా ముందుగానే వివరించింది. అజర్‌ బైజాన్‌కు చెందిన మహబూబా మహ్మమ్మద్‌ జాదా అనే ఓ మోడల్‌ కన్యాత్వాన్ని కూడా ఇటీవల తాము టోక్యోలోని ఓ రాజకీయ నాయకుడికి విక్రయించినట్లు సిండరెల్లా ఎస్కార్ట్స్‌ తెలియజేసింది.