తెలంగాణలో లోక్‌సభ విజేతలు

23 May, 2019 - 5:33 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలను వివిధ పార్టీల అభ్యర్థులకు ఓటర్లు పట్టం కట్టారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి తొమ్మిది మంది అభ్యర్థులు గెలుపొందగా, కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు, బీజేపీ నుంచి నాలుగు, ఎంఐఎం 1 స్థానాన్ని గెలుచుకుంది. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కుమార్తె, కె. కవిత ఓటమి పాలయ్యారు. నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె… బీజేపీ అభ్యర్థి, డి.శ్రీనివాస్ తనయుడు ధర్మపూరి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు.

టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటి చేసి గెలుపొందిన విజేతలు
మెదక్ : కొత్త ప్రభాకర్ రెడ్డి
మహబూబాబాద్ (ఎస్టీ) : మాలోతు కవిత
పెద్దపల్లి (ఎస్సీ) : వెంకటేశ్ నేత
జహీరాబాద్: బి.బి. పాటిల్
మహబూబ్‌నగర్ : మన్నె శ్రీనివాస్ రెడ్డి
నాగర్ కర్నూలు (ఎస్సీ) : పి.రాములు
వరంగల్ (ఎస్సీ): పసునూరి దయాకర్
ఖమ్మం : నామా నాగేశ్వరరావు

చేవెళ్ల : రంజిత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన అభ్యర్థులు
మల్కాజ్‌గిరి: రేవంత్‌రెడ్డి
నల్గొండ: ఉత్తమ్ కుమార్ రెడ్డి
భువనగిరి : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

బీజేపీ నుంచి గెలుపొందిన అభ్యర్థులు
ఆదిలాబాద్ (ఎస్టీ) : సోయం బాపురావు
కరీంనగర్‌ : బండి సంజయ్‌
నిజామాబాద్: ధర్మపూరి అరవింద్
సికింద్రాబాద్: జి.కిషన్ రెడ్డి

ఎంఐఎం నుంచి గెలుపొందిన అభ్యర్థి
హైదరాబాద్: అసదుద్దీన్ ఓవైసీ