బీజేపీలోకి మాజీ డిప్యూటీ సీఎం భార్య

11 October, 2018 - 5:25 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింమ భార్య పద్మిని రెడ్డి .. భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ సమక్షంలో ఆమె కమలం పార్టీలో చేరారు. అయితే తెలంగాణ బీజేపీలో పద్మిని రెడ్డి చేరికను స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.