డకౌట్‌లో రికార్డ్!

25 August, 2019 - 7:44 AM

 (న్యూవేవ్స్ డెస్క్)

ఆంటిగ్వా: టీమిండియాతో ఆంటిగ్వాలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో విండీస్ టెయిలెండర్ క్రికెటర్ మిగెల్ కమిన్స్ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో శనివారం పదో నంబర్ ఆటగాడిగా క్రీజులోకి వచ్చిన మిగెల్ 45 బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండా అవుటయ్యాడు. ఫలితంగా అత్యధిక బంతులు ఆడి డకౌట్ అయిన విండీస్ క్రికెటర్లలో మొదటి వాడిగా మిగెల్ తన పేరును రికార్డుల్లో లిఖించుకున్నాడు.

మిగెల్ కంటే ముందు కె.అర్ధర్‌టన్ 40 బంతులు, ఎం.డిల్లాన్ 29 బంతులు, సి.బట్స్ 27 బంతులు, ఆర్.ఆస్టిన్ 24 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరారు. ఇప్పుడు వారందరి కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొని డకౌట్ అయిన విండీస్ ఆటగాడిగా కమిన్స్ రికార్డులకెక్కడం గమనార్హం.