(న్యూవేవ్స్ డెస్క్)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహరెడ్డి. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రం 151వది. కాగా చిరంజీవి తన 152వ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారని… ఈ చిత్రం ప్రముఖ వైజయంతి మూవీస్ బ్యానర్లో తెరకెక్కనుందని సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేస్తుంది. దీంతో చిరంజీవి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అయితే దీనిపై వైజయంతి మూవీస్ బ్యానర్స్ స్పందించింది… తాము చిరంజీవి 152వ సినిమాను నిర్మించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదంది. మెగాస్టార్ చిరంజీవితో తమ బ్యానర్ ఇప్పటికే నాలుగు బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలు చేశామని గుర్తు చేసింది. చిరంజీవితో మరో చిత్రం చేస్తున్నామంటూ వస్తున్న వార్తలో నిజం లేదని ప్రకటించింది. చిరంజీవితో ఐదో బ్లాక్‌బస్టర్ సినిమా చేస్తే తామే గర్వంగా ప్రకటిస్తామంటూ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది.
వైజయంతి మూవీస్ ఇటీవల సావిత్రి బయోపిక్ మహానటి నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. తాజాగా నాగార్జున, నానీలు నటించిన మల్టీ స్టారర్ చిత్రం దేవదాస్ కూడా సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. ఈ చిత్రాన్ని వైజయంతి బ్యానర్ నిర్మిస్తున్న విషయం విధితమే. వైజయంతి మూవీస్ బ్యానర్ సీ అశ్వనీ