బాలయ్యతో సినిమాపై వినాయక్ క్లారిటీ

10 August, 2018 - 4:33 PM

 

(న్యూవేవ్స్ డెస్క్)

ఎన్టీఆర్ బయోపిక్‌తో యువరత్న నందమూరి బాలకృష్ణ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా నటిస్తునే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన విడుదల కానుంది. అయితే మాస్ డైరెక్టర్ వినాయక్‌తో బాలయ్య ఓ సినిమా చేయిబోతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.

కాగా దీనిపై వి.వి.వినాయక్ స్పష్టత ఇచ్చారు. తన తర్వాత సినిమాలో హీరో బాలకృష్ణేనని ఆయన స్పష్టం చేశారు. బాలయ్య కోసం కథ సిద్దం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ పనిలో తాను బిజీబిజీగా ఉన్నానని తెలిపారు. అందువల్లే కొంత గ్యాప్ వచ్చిందన్నారు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఇంటెలిజెంట్ తర్వాత వినాయక్ మరో సినిమాను ఇప్పటి వరకు ప్రకటించ లేదు.