‘అభిమన్యుడు‌’ టీజర్ విడుదల

06 January, 2018 - 3:53 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తూ… నిర్మిస్తున్న చిత్రం ‘అభిమన్యుడు’. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ విభిన్న పాత్రలో నటిస్తున్నారు. మాస్ హీరో విశాల్ సరసన హీరోయిన్‌గా సమంత నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు.

‘ఈ కాలపు దొంగకి నీ ఇంటి తాళాలు అక్కర్లేదు. నీ గురించిన ఓ చిన్న ఇన్‌ఫర్మేషన్ చాలు…’ అంటూ ప్రారంభమయ్యే టీజర్‌లో సినిమా ఏ పార్మాట్‌లో ఉండబోతోంది. సాంకేతికతంగా ఎలాంటి స్టాండర్డ్స్ లో ఈ చిత్రాన్ని రూపొందించారు అనే విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి.

యువన్ శంకర్ రాజా అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందనేది టీజర్‌లోనే అర్థమవుతోంది. విశాల్ న్యూలుక్, యాక్షన్ సీక్వెన్స్‌లు, యాక్షన్ కింగ్ అర్జున్ డిఫరెంట్ లుక్, సమంత గ్లామర్ … ఇవన్నీ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

విశాల్ కెరీర్‌లో మరో సూపర్ హిట్ సినిమాగా అభిమన్యుడు నిలువనుందని చిత్ర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని జనవరిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు విశాల్. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, నిర్మాత: విశాల్‌, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌.