ప్రమిదలతో కోహ్లీ ఆర్ట్ చిత్రం!

02 November, 2018 - 2:11 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: భారత క్రికెట జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓ అభిమాని వినూత్న రీతిలో ట్రిబ్యూట్ అర్పించాడు. ముంబైకి చెందిన అబ్బాసాహెబ్ షేవాలే అనే కళాకారుడు 4,482 ప్రమిదలతో కోహ్లీ రూపాన్ని రూపొందించాడు. ఈ రూపంలో విరాట్ కోహ్లీ పుట్టిన రోజుతో పాటు దీపావళి పండుగ ఉద్దేశం కూడా ప్రతిబింబించేలా రూపొందించాడు. ఈ రూపాన్ని నవీ ముంబైలోని సీవుడ్స్‌ గ్రాండ్ సెంట్రల్‌‌లో అభిమానుల కోసం ప్రదర్శనకు ఉంచారు. 9.5 అడుగుల వెడల్పు, 11 అడుగుల ఎత్తు ఉన్న ఈ రూపం ఇప్పుడు అందరినీ బాగా ఆకర్షిస్తోంది.

విరాట్ కోహ్లీ రికార్డులకు ప్రశంసగా ప్రమిదలతో అతని రూపాన్ని తయారు చేసినట్లు అబ్బా సాహెబ్ షేవాలే తెలిపాడు. ఇందుకోసం మొత్తం 4,482 ప్రమిదలను ఉపయోగించాడు. ఈ ఆర్ట్ వర్క్‌‌ను రూపొందించేందుకు మొత్తం ఎనిమిది గంటల సమయం పట్టిందట. ప్రపంచంలోనే ప్రమిదలతో తయారు చేసిన అతి పెద్ద కళాఖండంగా ఇది నిలుస్తుంది.ఈ ఆర్ట్ వర్క్‌‌ని రూపొందించిన అబ్బాసాహెబ్ షేవాలే మాట్లాడుతూ.. ‘విరాట్‌ కోహ్లీ కాంతివంతమైన దీపంలా వెలిగిపోతున్నాడు. దీపావళి సమీపిస్తోన్న తరుణంలో ఆయనకు ప్రశంసలు తెలపడానికి ఇది సరైంది. అంతే కాకుండా నవంబరు 5న కోహ్లీ పుట్టినరోజు’ అని వెల్లడించారు. ఈ ఆర్ట్ వర్క్‌‌కు సంబంధించిన వీడియోని అబ్బాసాహెబ్ షేవాలే తన ఫేస్‌‌బుక్ పేజిలో అభిమానులతో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.