రామ్ చరణ్ సినిమాకి…

08 January, 2019 - 4:02 PM

(న్యూవేవ్స్ డెస్క్)

టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రం జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే జనవరి 11 నుంచి 19వ తేదీ వరకు వినయ విధేయ రామ చిత్రం స్పెషల్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

సంక్రాంతి పండగ రోజుల్లో సినిమా థియేటర్లకు హౌస్ ఫుల్ బోర్డులు పడతాయి. ఈ నేపథ్యంలో సదరు రోజుల్లో ఉదయం 5.00 గంటలు, రాత్రి 11.00 గంటల వరకు అదనంగా మరో రెండు షోలు వేయనున్నారు. దాంతో సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది.

బోయపాటి.. తన మాస్ శైలిలో చిత్రాలను తెరకెక్కిస్తారు.. అలాగే చరణ్ నటన… ఇక కైరా అద్వానీ అందాలను ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు విడుదలై… చరణ్ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే.