వినయ విధేయ రామ టీజర్ రిలీజ్

08 November, 2018 - 5:01 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వినయ విధేయ రామ. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తుంది.

ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను దీపావళి కానుకగా విడుదల చేశారు. బోయపాటి మాస్ యాక్షన్‌కి తగినట్లు… శత్రువులపై విరుచుకుపడుతూ చరణ్ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను నవంబర్ 9వ తేదీన ఉదయం 10.25 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో స్నేహ, ప్రశాంత్, అల్లరి నరేష్ సోదరుడు అర్యన్ రాజేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.