ఏపీ సీఎస్‌కి విజయసాయి లేఖ

18 April, 2019 - 9:03 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ఇజ్రాయిల్‌కి చెందిన వెరింట్ కంపెనీకి .. ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులను వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు గురువారం ఏపీ సీఎస్ ఎల్వీకి విజయసాయి లేఖ రాశారు. వెరింట్ కంపెనీ నుంచి ఏపీ డీజీపీ కార్యాలయం కొనుగోలు చేసిన… యంత్రాలకు రూ. 12.5 కోట్లు చెల్లించవద్దని ఎల్వీ సుబ్రహ్మణ్యంను విజయ సాయిరెడ్డి కోరారు.

ఎలాంటి అనుమతులు లేకుండా నిపుణుల అభిప్రాయం కూడా తీసుకోకుండా.. కేవలం ఏకపక్షంగా ఈ యంత్రాలను కొనుగోలు చేశారని విజయ సాయి రెడ్డి ఈ లేఖలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ యంత్రాల బిల్లులను చెల్లించవద్దని సీఎస్ ఎల్వీని విజయ సాయి కోరారు.