‘నో’ చెప్పిన విజయ్

07 January, 2019 - 5:29 PM

(న్యూవేవ్స్ డెస్క్)

టాలీవుడ్‌లో వరస హిట్లలో దూసుకుపోతున్న అగ్ర హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఆయన నటించిన చిత్రాలు సూపర్ డూపర్ హిట్స్ సాధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండకు బాలీవుడ్‌లో నటించే అవకాశం దూసుకు వచ్చింది. అదీ కూడా ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్. ‘83’ పేరుతో ఈ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రంలో నటించేందుకు విజయ్ దేవరకొండ నో అని చిత్ర నిర్మాతలకు క్లారిటీగా చెప్పేశారు. ఈ చిత్రంలో ముఖ్య పాత్ర అయితే ఒకే కానీ…. మరో పాత్ర అంటే నో అని విజయ్ దేవరకొండ వారికి స్పష్టంగా చెప్పారట.

1983లో భారత్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆప్పడు టీమ్‌కి కపిల్ దేవ్ కెప్టెన్‌గా ఉన్నారు. అదే సమయంలో ఈ టీమ్ గెలుపొందడానికి కపిల్‌తోపాటు శ్రీకాంత్ కృష్ణమాచారీ కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. అయితే కపిల్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నారు. ఇక శ్రీకాంత కృష్ణమాచారి పాత్ర కోసం విజయ్ దేవరకొండ చేయమని .. 83 చిత్ర నిర్మాతలు కోరారట. ఈ నేపథ్యంలో విజయ్ నో అని చెప్పారు. 83 చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే విజయ్ దేవరకొండ కూడా డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నారు.