విజయ్ కొత్త అవతారం

09 May, 2019 - 8:26 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయ్ దేవరకొండ. వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో. సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ వైలంట్‌గా కనిపిస్తే.. పరుశ్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీతగోవిందం చిత్రంలో సైలంట్ లవర్ బాయ్ గా కనిపించాడు.

అతగాడి నటనకు అందరూ ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రంలో విజయ్ కొత్త అవతారంలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందాన నటిస్తుంది.

గతంలో విజయ్, రష్మిక జంటగా నటించిన చిత్రం గీతగోవిందం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. తాజాగా మళ్లీ వీరిద్దరితో వస్తున్న ఈ చిత్రంపై అందరూ అతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం జులై 26న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహించారు.