విజయ్‌కి కొత్త పేరు

18 March, 2019 - 5:01 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయ్ దేవరకొండ. ఈ హీరో టాలీవుడ్‌లో ఓ సంచలనం. అతడు నటించిన అన్ని చిత్రాలు దాదాపు సూపర్ డూపర్ హిట్ సాధించినవే. తాజా విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర టీజర్.. మార్చి 17న విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ వ్యూస్ పరంగా సరికొత్త సంచలనం సృష్టించింది.

అయితే ఈ టీజర్‌లో కంటెంట్ కంటే.. హీరో విజయ్, హీరోయిన్ రష్మిక మందన కిస్ బాగా క్లిక్ అయింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండకకు నెట్‌జన్లు కొత్త బిరుదు ఇచ్చారు. అదే టాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ. అయితే ఇప్పటి వరకు విజయ్ దేవరకొండకు ఫిల్మ్ ఇండస్ట్రీలో బిరుదులు అంటూ లేవు.

తాజాగా ఈ బిరుదుతో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పేరు హల్‌చల్ చేస్తుంది. విజయ్ దేవరకొండ ఇప్పటికే మూడు నాలుగు సినిమాల్లో లిప్ లాక్‌లు ఉండటమే అందుకు కారణమని అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.

అయితే ఈ చిత్ర టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 3.3 మిలియన్ల మంది వీక్షించారు. ఈ టీజర్ మొదటి స్థానంలో ఉంది. డియర్ కామ్రేడ్ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, మలయాళం, తమిళం,కన్నడ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు సమకురుస్తున్నారు.