విజయ్ ‘సెంటిమెంట్’

21 September, 2019 - 2:44 PM

(న్యూవేవ్స్ డెస్క్)
హైదరాబాద్: టాలీవుడ్‌లో ఒకొక్కరికి ఒకొక్క సెంటిమెంట్ ఉంటుంది. అదీ హీరో అయిన, హీరోయిన్ అయినా, దర్శకుడు అయినా.. ఎవరైనా సరే.. ఒక చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించినా.. లేకుంటే తన లైఫ్‌కి టర్నింగ్ పాయింట్ ఇచ్చిన చిత్రం ఉంటే.. ఆ చిత్రంలోని స్టైల్‌ లేదా టైటిల్‌లోని మొదటి అక్షరం… ఫాలో అయిపోతారనే టాక్ ఉందన్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ కూడా ఓ సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నాడనే టాక్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రియేటీవ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్ రామారావు సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కాగా  చిత్ర ఫస్ట్‌ లుక్ శుక్రవారం హైదరాబాద్లో విడుదల చేశారు.
 ఫస్ట్‌ లుక్లో హీరో విజయ్ చేతిలో విసిరివేయడానికి సిద్ధంగా ఉన్న సిగిరెట్నోటి నుంచి వస్తున్న సిగరెట్ పొగతోపాటు ముక్కు, నుదుటిపై రక్తపు మరకలు ఉన్నాయిదీంతో విజయ్ సెంటిమెంట్‌ బలంగా ఫాలో అవుతున్నడని అతడి ఫ్యాన్స్  సైతం సోదాహరణగా వివరిస్తున్నారు. అందుకు తమ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రాల విషయాన్ని వారు వివరిస్తున్నారు. విజయ్ దేవరకొండ లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ ఇచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రం విజయ్ దేవరకొండను హీరోగా ఎక్కడికో తీసుకువెళ్లింది.
అంతేకాదు.. ఈ చిత్రం పలు భాషల్లో సైతం రీమేక్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ అర్జున్ రెడ్డి చిత్రం ఫస్ట్‌ లుక్‌లో విజయ్.. ముక్కుకు ప్లాస్టర్ వేసుకుని కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ చిత్రంలో సైతం విజయ్ ముఖంపై రక్తపు మరకలు, ప్లాస్టర్‌తో దర్శనమిచ్చాడు. అదేవిధంగా అతడు తాజాగా నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్‌ లుక్‌లో కూడా విజయ్ ముఖంపై రక్తపు మరకలు ఉన్నాయి.
దీంతో విజయ్ ఫస్ట్ లుక్‌లో రక్తం, ప్లాస్టర్ వేసిన ఉంటే.. ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధిస్తుందనే నమ్మకంతో తమ హీరో ఉన్నాడని అతడి ఫ్యాన్స్ పేర్కొంటుంది. అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ చిత్ర ఫస్ట్‌ లుక్ దాదాపు అర్జున్‌రెడ్డి ఫస్ట్ పోస్టర్‌ని పోలి ఉందని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అంతేకాదు….ఈ ఫస్ట్‌ లుక్ మరీ ఎక్స్‌ ట్రీమ్‌గా ఉందని విజయ్ ఫ్యాన్స్‌  పేర్కొంటుంది.
మరోవైపు విజయ్ దేవరకొండ హీరోగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఫైటర్ అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ నటి ఛార్మీ కౌర్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ సహ నిర్మాతలుగా ఐ స్మార్ట్ శంకర్ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడదలై ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించిన విషయం విదితమే. ఈ చిత్రంలో రామ్ పోతినేని హీరోగా నటించాడు.