తెలుగులో ‘కాశి’గా విజ‌య్‌ ఆంటోని

15 April, 2018 - 4:48 PM

బిచ్చగాడు లాంటి బ్లాక్‌‌బ‌స్టర్ చిత్రం త‌రువాత తెలుగు ప్రేక్సకుల మ‌న‌సుకు బాగా ద‌గ్గరైన విజ‌య్ ఆంటోని హీరోగా, తెలుగు హీరోయిన్‌గా సౌత్ ఇండియాలో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్న అంజ‌లి హీరోయిన్‌గా, క్రితిక ఉద‌యనిధి ద‌ర్శక‌త్వంలో త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో రూపొందుతున్న చిత్రం ‘కాలి’. మ‌రో హీరోయిన్‌ సున‌య‌న. ఈ చిత్రం తెలుగు రైట్స్‌ని ప్రముఖ నిర్మాణ సంస్థ పిక్చర్‌బాక్స్ కంపెనీ అధినేత విలియ‌మ్ అలెగ్జాండ‌ర్ సొంతం చేసుకున్నారు. తెలుగు వెర్షన్‌కి కాశి అనే టైటిల్ ఖ‌రారు చేశారు. అతిత్వర‌లో కాశి చిత్రానికి సంబంధించిన అన్ని వివ‌రాలు తెలియ‌జేస్తారు. ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.బిచ్చగాడు లాంటి బ్లాక్‌‌బ‌స్టర్ చిత్రం త‌రువాత విజ‌య్ ఆంటోనికి తెలుగులో చాలా మంచి క్రేజ్ వ‌చ్చింది. ట్రేడ్‌లో బిజినెస్ క్రేజ్ కూడా బాగా పెరిగింది. విజ‌య్ ఆంటోని సినిమా అంటే ఓపెనింగ్స్ వ‌స్తున్నాయంటే ఆయ‌న చేస్తున్న చిత్రాలు, కాన్సెప్ట్‌లు అంత‌లా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఆయ‌న హీరోగా త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో నిర్మిస్తున్న చిత్రం కాలిని తెలుగులో కాశిగా విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పిక్చర్‌బాక్స్ కంపెని బ్యాన‌ర్‌లో త్వర‌లో తెలుగు ప్రేక్షకుల‌కు అందిస్తున్నారు. బిచ్చగాడు చిత్రం త‌రువాత మ‌ద‌ర్ సెంటిమెంట్‌లో మ‌రో కోణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అంజ‌లి, సున‌య‌న హీరోయిన్స్‌గా చేస్తున్నారు. హీరోగా త‌న న‌ట‌విశ్వరూపాన్ని చూపిస్తూ సంగీతాన్ని కూడా విజ‌య్ ఆంటోని అందించ‌టం విశేషం. ఈ చిత్రం బిచ్చగాడు కంటే క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్దవిజ‌యాన్ని సాధిస్తుంద‌ని, పూర్తి వివ‌రాలు త్వర‌లో తెలియ‌జేస్తాం అని నిర్మాత విలియ‌మ్ అల‌ెగ్జాండ‌ర్ అన్నారు.

బ్యాన‌ర్‌: పిక్చర్‌బాక్స్ కంపెని, నిర్మాత‌: విలియ‌మ్ అల‌ెగ్జాండ‌ర్‌, ద‌ర్శక‌త్వం: క్రితిక ఉద‌యనిధి.