రుక్మాంగదరావుగా ….

02 December, 2018 - 4:11 PM

(న్యూవేవ్స్ డెస్క్)

వెన్నెల కిషోర్. టాలీవుడ్‌లో కామెడియన్‌ పాత్రలే కాక… సీరియస్ పాత్రలను సైతం చేయగల స్తతా ఉన్న నటుడు. తాజా వెన్నెల కిషోర్.. ఎన్టీఆర్ బయోపిక్‌ రెండు భాగాలుగా.. కథానాయకుడు, మహానాయకుడుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే కథనాయకుడులో ఓ పాత్రకు చిత్ర దర్శకుడు క్రిష్ ఎంపిక చేశారు. అదీ రుక్మాంగదరావు పాత్ర. అంటే ఎన్టీఆర్ మేనేజన్ పాత్ర.

ఇంకా అర్థమయ్యేలా చెప్పాంటే.. ఎన్టీఆర్ సతీమణి నందమూరి బసవతారకం సోదరుడు. ఎన్టీఆర్ జీవిత గమనంలో ఈ రుక్మాంగదరావు పాత్ర అత్యంత కీలకమని టాలీవుడు‌లోని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ పాత్రకు వెన్నెల కిషోర్‌ను దర్శకుడు క్రిష్ ఎంపిక చేశారు.

అందులోభాగంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయి నటిస్తున్న నందమూరి బాలకృష్ణ, వెన్నెల కిషోర్ మధ్య పలు కీలకమైన సన్నివేశాలను త్వరలో క్రిష్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ కథనాయకుడు చిత్రం జనవరి 9వ తేదీన విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అలాగే మహానాయకుడు చిత్రం విడుదల తేదీపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.