సంక్రాంతి నుంచి ‘అజ్ఞాతవాసిలో’ వెంకీ

12 January, 2018 - 3:13 PM

పవర్‌ ​స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమాలో నటుడు వెంకటేష్‌ అతిథి పాత్రలో మెరవబోతున్నారంటూ అప్పట్లో ఓ వార్త బాగా వినిపించింది. టైటిల్‌ కార్డ్స్‌‌లో కూడా వెంకీకి స్పెషల్‌ థ్యాంక్స్‌ ఉండటంతో ఆయన పాత్ర ఈ సినిమాలో ఉంటుందని అంతా భావించారు. కానీ, మూవీలో మాత్రం ఆయన ఎక్కడా కనిపించలేదు.

దీంతో వెంకీ నటించిన సీన్‌‌ను కలపాలని అజ్ఞాతవాసి టీం డిసైడ్‌ అయింది. ఈ మేరకు ఓ మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది. వెంకటేష్- పవన్‌ కల్యాణ్ మధ్య నడిచే అ సన్నివేశం కోసం ఇద్దరు స్టార్లు కలిసి డబ్బింగ్‌ చెప్పటం ఆ వీడియోలో ఉంది.

పవన్‌ కల్యాణ్.. ‘గురువు గారు’ అంటే.. ‘గారు అక్కర్లేదమ్మా గురూ చాలూ..’ అని వెంకీ చెప్పటం.. ‘నాకు కొంచెం తిక్కుంది’ అని పవన్‌ అంటే… ‘దానికో లెక్కుంది’ అని మళ్లీ వెంకీ చెప్పటం ఇలా సాగిపోయిన వీడియో ఫన్నీగా ఉంది. ఈ సీన్‌‌ను సంక్రాంతి నుంచి అజ్ఞాతవాసి మూవీకి కలుపుతున్నారు.

వెంకీది ఈ సినిమాలో మేనమామ పాత్ర అన్నారు. కామెడీ మామూలుగా పేలదన్నారు. ఆ తర్వాత.. కాదు, కాదు యాక్షన్ సీన్ అన్నారు. సరే, ఏదో ఒకటి తెర పైనే సర్‌‌ప్రైజ్ చేస్తారులే అని ఆడియన్స్ అనుకున్నారు. కానీ.. తెరపై బొమ్మ పడి సినిమాలో ఒక్కో సీన్ అలా కదిలిపోతుంటే.. ఇంకెక్కడ ‘వెంకీ’?.. ఎంతకీ రాడే?.. సినిమా అయ్యాక కానీ విషయం అర్థం కాలేదు. అసలు సినిమాలో వెంకీ సీన్స్ లేవని. ఇలా నిరాశపడిన అభిమానుల కోసం ‘అజ్ఞాతవాసి’ టీమ్ ఇప్పుడు ఆ సీన్స్ యాడ్ చేయబోతుందట!