వెంకీ- చైతూ మల్టీ స్టారర్ లాంచ్!

11 July, 2018 - 5:08 PM

విక్టరీ వెంకటేశ్ ఒక వైపున వరుణ్ తేజ్‌తో కలసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి ‘ఎఫ్ 2’ అనే టైటిల్ ఖరారు చేశారు. కాగా.. వెంకీతో మరో మల్టీస్టారర్ మూవీ బుధవారం లాంచ్ అయింది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది.

బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మరో హీరోగా అక్కినేని నాగచైతన్య నటిస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించే ఈ సినిమాలో చైతూకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక అయింది. వెంకీ సరసన ఎవరు చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలెట్టనున్నారు.

ఈ మూవీకి ‘వెంకీ మామ’ అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చందూ మొండేటితో ‘సవ్యసాచి’, మారుతితో ‘శైలజారెడ్డి అల్లుడు’ మూవీలు చేస్తోన్న చైతూ ఈ రెండు సినిమాలతో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.