నా వాల్మీకికి…

18 April, 2019 - 8:39 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్ర షూటింగ్ గురువారం ప్రారంభమైంది. అయితే ఈ చిత్ర షూటింగ్‌లో వరుణ్‌ లుక్‌కు సంబంధించి ఓ పిక్‌ను దర్శకుడు హరీష్ శంకర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. ఇలా కామెంట్ పెట్టారు ‘నా వాల్మీకికి స్వాగతం… తొలి రోజు షూటింగ్ అద్భుతంగా జరిగింది. ఇది ఇలాగే సాగాలని ఎదురు చూస్తున్నా… మండు వేసవిలో కష్టపడుతున్న డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫి బోస్‌కు ధన్యవాదాలు’ అంటూ ట్విట్ చేశారు.

అయితే వరుణ్ తేజ్ ఈ ఫోటోలో గెడ్డం, చెవికి రింగ్‌తో ఉండి పక్కా మాస్‌లా కనిపిస్తూన్నారు. దాంతో ఈ ఫోటోను వరుణ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

బాబీ సింహ, అధర్వ మురళి నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ అచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమిళ చిత్రం రీమెక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.