‘రెండు కాల్చాలి.. రెండు దాచుకోవాలి’

15 August, 2019 - 7:28 PM

(న్యూవేవ్స ్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో హీరో వరుణ్ తేజ్ పక్కా మాస్ గెటప్‌లో అదిరిపోయాడు. అంతేకాదు.. అందుకే పెద్దోళ్లు చెప్పిర్రు.. నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే.. రెండు కాల్పుకోవాలి.. రెండు దాచుకోవాలి అంటూ వరుణ్ తేజ్ చెప్పే డైలాగులు అదిరిపోయాయి.

అలాగే ఈ టీజర్ ప్రారంభంలో నా సినిమాలో నా విలనే.. నా హీరో అంటూ తమిళ నటుడు అధర్వ చెప్పే డైలాగు కూడా బావుంది. తమిళ చిత్రం ‘జిగర్తండ’కి ఈ చిత్రం రీమేక్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచండ, గోపి ఆచంటలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ స్వరాలు అందించారు. సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా వాల్మీకి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.