వరుణ్ ‘వాల్మీకి’

22 June, 2019 - 2:59 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్రం ప్రీ టీజర్ జూన్ 24వ తేదీ సాయంత్రం 5.18 గంటలకు విడుదల చేయనున్నట్లు హీరో వరుణ్ తేజ్ ప్రకటించారు. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.

సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ వాల్మీకికి మిక్కీజే మేయర్ స్వరాలు సమకురుస్తున్నారు. అయితే విక్టరీ హీరో వెంకటేష్‌తో కలసి వరుణ్ తేజ్ నటించిన ఎఫ్‌2 చిత్రం మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

అదీకాక హరీష్ శంకర్ ఇప్పటికే మెగా ఫ్యామిలీలోని పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌‌తో గబ్బర్ సింగ్, సాయిధరమ్ తేజ్‌తో సుబ్రమణ్యం ఫర్ సేల్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో దువ్వాడ జగన్నాథం చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. వాల్మీకి చిత్రం తమిళంలో వచ్చిన జిగర్తాండకి తెలుగు రీమేక్ అన్న విషయం విదితమే.