ట్రైలర్‌కి టైమ్ ఫిక్స్

08 September, 2019 - 9:30 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో విడుదల తేదీని తెలియజేస్తూ హీరో వరుణ్ తేజ్ … తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్ట్ పై టాలీవుడ్ మరో ప్రముఖ హీరో నితీన్ ఇలా స్పందించారు… ‘నేను చూస్తున్నా సెప్టెంబర్ 20న’ అని తెలిపారు.

ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వరుణ్  వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నారు.  అలాగే ఈ చిత్ర టైలర్ సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తమిళంలో విజయం సాధించిన జిగర్తండ చిత్రాన్ని తెలుగులో వాల్మీకిగా రీమేక్ చేస్తున్నారు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.