సినిమా విడుదల వాయిదా?

18 March, 2020 - 8:43 PM

(న్యూవేవ్స్ డెస్క్)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ చిత్రం విడుదల వాయిదా పడిందని సమాచారం. కరోనా వైరస్ నేపథ్యంలో స్కూళ్లు, థియేటర్లు, పబ్‌లు.. ఇలా అన్ని వాయిదా పడ్డాయి. ఈ వకీల్ సాబ్ షూటింగ్ కూడా వాయిదా పడిందనే టాక్ వైరల్ అవుతోంది.

దాంతో ఈ చిత్రం జులై లేదా అగస్టులో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్‌  బట్టి కొన్ని రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని నిర్మాత దిల్ రాజు భావించారు. ఆ క్రమంలో ఈ చిత్ర షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. అయితే కరోనా ప్రభావం కరణంగా.. షూటింగ్ వాయిదా పడింది. దీంతో కొత్త డేట్స్ సెట్ చేసే పనిలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తోంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచమహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలోని మగువా మగువా సాంగ్ విడుదల చేశారు. అలాగే ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. బాలీవుడ్‌లో విడుదలైన పింక్ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రంలో పవన్.. లాయర్‌గా కనిపించనున్నారు.