మహిళ కడుపులో 60 కిలోల కణితి!

06 May, 2018 - 11:23 AM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూయార్క్: ఓ మహిళ కడుపులో సుమారు 60 కిలోల బరువున్న కణితిని వైద్యులు విజయవంతంగా తొలగించారు. అమెరికాలోని కనెక్టికట్‌లో ఈ సంఘటన జరిగింది. రోజు రోజుకూ అధికంగా బరువు పెరుగుతున్న ఓ మహిళ వైద్యులను సంప్రదించింది. దీంతో ఆమె కడుపులో కణితి ఉన్నట్టు గుర్తించారు. ఆ కణితిని విజయవంతంగా తొలగించారు.

అమెరికా కనెక్టికట్‌‌లోని ఆ మహిళ అండాశయంలో 60 కిలోల కణితి పెరుగుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ కణితి కారణంగా బాధితురాలు అనుహ్యంగా బరువు పెరుగుతోంది. అనుహ్యంగా బరువు పెరుగుతున్నట్టు గుర్తించిన బాధితురాలు వైద్యులను సంప్రదించింది. బాధితురాలిని పరీక్షించిన వైద్యులు ఆమె అండాశయంలో కణితి ఉన్నట్టు గుర్తించారు. సిటీ స్కాన్ చేస్తే ఆమె అండాశయంలో పెద్ద గడ్డ ఉందని గుర్తించినట్టు డాన్‌‌బరీ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ వాన్ ఆండిక్యాన్ చెప్పారు.

అయితే.. ఇంత పెద్ద కణితిని తొలగించే విషయమై వైద్యులు సుదీర్ఘంగా తర్జన భర్జనలు చేశారు. సుమారు 25 మంది వైద్య నిపుణుల బృందం ఐదు గంటల పాటు శ్రమించి, బాధితురాలి అండాశయంలో ఉన్న కణితిని తొలగించారు.