సివిల్స్-2017 మెయిన్స్ ఫలితాలు విడుదల

10 January, 2018 - 8:56 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ఢిల్లీ: సివిల్స్‌-2017 మెయిన్స్‌ ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ (యూపీఎస్సీ) బుధవారం విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను యూపీఎస్సీ అధికారికక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, తదితర కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి ఉద్యోగుల ఎంపిక కోసం గతేడాది అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 3 వరకు యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించింది. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 19 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశముందని యూపీఎస్సీ తెలిపింది. ఇంటర్వ్యూ లెటర్‌ను జనవరి 18 నుంచి వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నట్లు పేర్కొంది.