దూసుకుపోతున్న ధక్ ధక్ ధక్

10 March, 2020 - 8:41 PM

(న్యూవేవ్స్ డెస్క్)

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో నటుడు వైష్ణవ్ తేజ్. అతడు కీర్తి శెట్టితో కలిసిన నటిస్తున్న తాజా చిత్రం ఉప్పెన. ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రంలోని నువ్వు నేను ఎదురైతే ధక్ ధక్ ధక్.. మనస్సు మనస్సు దగ్గర అయితే ధక్ ధక్ ధక్.. మనసులు అలలై పొంగుతుంటే ధక్ ధక్ ధక్… అంటూ సాగే పాటను సోమవారం విడుదల చేశారు. అయితే వ్యూస్ పరంగా దూసుకుపోతుంది.

ఈ సాంగ్ వ్యూస్ పరంగా 24 లక్షలు దాటేసింది. అలాగే లైక్‌ల పరంగా కూడా మంచి స్పందన వస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై ఈ చిత్రం విడుదల కానుంది. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నా ఈ చిత్రానికి బచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యేర్నేనీ, వై రవి శంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు.