‘18 పేజస్’లో కీర్తి శెట్టి

17 March, 2020 - 6:16 PM

(న్యూవేవ్స్ డెస్క్)

నిఖిల్ సిద్ధార్థ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘18 పేజస్’. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి శెట్టిని ఎంపిక చేశారు. ఇప్పటికే కీర్తి శెట్టి.. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఉప్పెన చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కుమారి 21 ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ కార్తికేయ 2 చిత్రంలో నటిస్తున్నారు. 2014లో నిఖిల్ నటించిన కార్తికేయ చిత్రానికి ఇది సీక్వెల్. కార్తీకేయ 2 చిత్రానికి చందు మెండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు నిఖిల్ పెళ్లి అతడి గర్ల్ ఫ్రెండ్ పల్లవి వర్మతో ఏప్రిల్ 16న జరగనుంది.