అరవింద… ఆడియో రిలీజ్ లేదా?

14 September, 2018 - 8:09 PM

(న్యూవేవ్స్ డెస్క్)

వస్తుంది ఎన్నికల సీజన్‌. ఈ సీజన్‌లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకోసం అచీ తూచీ వ్యవహరిన్నారు తెలుగు తమ్ముళ్లు. అందులోభాగంగా ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత వీర రాఘవ… ఈ చిత్రం ఆడియో వేడుక సెప్టెంబర్ 20వ తేదీన జరగాల్సి ఉంది. ఈ వేడుకు ముఖ్య అతిథిగా బాలయ్య బాబు హాజరుకావల్సి ఉంది. కానీ ఈ కార్యక్రమం రద్దు అయింది.

ఈ చిత్రంలోని పాటలను నెట్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. అంతేకాదు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా… అదీకూడా ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించాలని భావిస్తుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలయ్య బాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అందుకోసం ఈ ఈవెంట్‌ను ఏ నగరంలో నిర్వహించాలి అనే అంశంపై చిత్ర యూనిట్‌ తర్జన భర్జన పడుతోంది. ఈ ఈవెంట్ ఎక్కడ అనేది ఒకటి రెండు రోజుల్లో ఖరారు కానుంది.

అయితే ఈ ఒకే వేదికపై నందమూరి నట సింహాలు బాలయ్య బాబు, ఎన్టీఆర్‌లను చూడవచ్చు అని వారి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఒకే వేదికపైకి అబ్బాయి.. బాబాయి  వస్తుండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అలాగే ఈ ప్రీ రిలీజ్ వేడుక వేదిక ఏపీలో ఏర్పాటు చేస్తే… అటు తెలుగు తమ్ముళ్లలో మంచి ఊపు ఉత్సాహం నింపవచ్చు అని..  ఇటు టీడీపీకి బలం అవుతోందని పోలిటికల్ ప్లాన్‌తోనే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఆంధ్రప్రదేశ్‌కు మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్ ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.