త్రిష ఔట్

13 March, 2020 - 7:50 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజివి నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో చిరంజివి సరసన త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు త్రిష స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. చిరంజివి నటిస్తున్న 152వ చిత్రంగా ఆచార్య తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి నిర్మాతగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వ్యవహరిస్తున్నారు.

అయితే త్రిష స్థానంలో కాజల్ అగర్వాల్‌ను తీసుకోవాలనే అంశంపై చిత్ర యూనిట్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఈ చిత్రంలో నటించేందుకు కాజల్ సుముఖత వ్యక్తం చేసినట్లు ఫిలింనగర్  లో వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే చిరంజివి 150వ చిత్రం ఖైది నెంబర్ 150లో చిరంజివి సరసన కాజల్ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇక చిరంజీవి నటించిన 151 వ చిత్రం సైరా నరసింహరెడ్డి కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి కూడా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహించిన విషయం విదితమే.