‘ఆకారణంగా స్పసెండ్ చేశారు’

13 May, 2019 - 4:05 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ క్రమ శిక్షణా సంఘం తనను అకారణంగా సస్పెండ్ చేసిందని నగేశ్ ముదిరాజు ఆరోపించారు. అందుకు నిరసనగా సోమవారం ఆయన గాంధీ భవన్‌లో నిరసన వ్యక్తం చేశారు. తనను ఆ కారణంగా సస్పెండ్ చేశారని ఆయన మండిపడ్డారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని నగేశ్ స్పష్టం చేశారు. క్రమశిక్షణ సంఘం వీహెచ్‌కి తొత్తులా పని చేస్తోందని విమర్శించారు.

మే 11వ తేదీన ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాలో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీహెచ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు మధ్య మాట మాట పెరిగి.. ఘర్షణకు దిరి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశమైంది. నగేశ్ ముదిరాజ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో నగేశ్ పై విధంగా స్పందించారు.