మళ్లీ షూటింగ్‌లో ‘చాణక్య’

03 October, 2019 - 6:57 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు సంపత్ నంది, హీరో గోపిచంద్ కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పూజా కర్యాక్రమాల అనంతరం ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తొలి క్లాప్ కొట్టగా.. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ నెంబర్ 3గా శ్రీనివాస్ చిట్టూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గోపిచంద్ సరసన తమన్నా నటిస్తోంది.
అయితే ఇటీవల సంపత్ నంది దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా నటించిన గౌతమ్ నంద చిత్రం విడులైంది. ఈ చిత్రం అంతగా విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో కథాబలమున్న మరో కథను సంపత్ నంది తయారు చేసుకుని.. హీరో గోపిచంద్‌కి వినిపించారు. ఈ చిత్రంలో నటించేందుకు గోపిచంద్ ఓకే చెప్పేశారు. గోపిచంద్ నటిస్తున్న 28వ చిత్రం ఇది.
ఇక గోపిచంద్, మొహర్రిన్ జంటగా నటించిన చిత్రం చాణక్య. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  అయితే గోపిచందన్ ఈ ఏడాది నటించిన ఈ మూడు చిత్రాలు.. పంతం, గౌతమ్ నందా అంతగా సక్సెస్ సాధించలేదు. ఈ నేపథ్యంలో గోపిచంద్ ఫ్యాన్స్ చాణక్యపై ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్‌ను సైతం పూర్తి చేసుకుని యూ సర్టిఫికేట్‌ పొందింది.