‘ఎమ్మెల్యే’ మూవీ టైటిల్‌ ఇదే

03 December, 2018 - 6:37 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 118 అనే టైటిల్‌ని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని మహేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది… అయితే నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలిని పాండే నటిస్తున్నారు.

జనవరి మూడో వారంలో ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మంచి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఈ టైటిల్ కరెక్ట్‌గా సరిపోతుందని ఈ చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర స్వరాలు సమకూరుస్తున్నారు.