జార్ఖండ్‌లో ముగ్గురు మావోలు ఎన్‌కౌంటర్

15 April, 2019 - 2:25 PM

(న్యూవేవ్స్ డెస్క్)

రాంచీ: జార్ఖండ్‌‌లోని గిరిదిహ్‌ అడవుల్లో సోమవారం ఉదయం తుపాకుల మోత మోగింది. మావోయిస్టులు- సీఆర్పీఎఫ్‌ జవాన్ల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఒక జవాను కూడా ప్రాణాలు కోల్పోయాడు.

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గిరిదిహ్‌ జిల్లా బెల్బాఘాట్‌ అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్‌ ఏడో బెటాలియన్‌ జవాన్ల పైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు నక్సల్స్‌‌ను హతమార్చారు. ఘటనాస్థలంలో ఒక ఏకే-47 రైఫిల్‌, 3 బులెట్‌ మ్యాగజైన్లు, 4 పైపు బాంబుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్‌ 29 నుంచి జార్ఖండ్‌‌లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుగాయి.