నిడదవోలు, టీపీగూడెంలో పవన్ సభలు

13 August, 2018 - 10:38 AM

 (న్యూవేవ్స్ డెస్క్)

నిడదవోలు (ప.గో.జిల్లా): జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాట యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్విరామంగా కొనసాగుతోంది. ప్రతి రోజూ రెండు, మూడు నియోజకవర్గాల్లో ఆయన జనసేన పోరాట యాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో రాష్ట్రంలోని వివిధ సమస్యలపై ఆయన స్పందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాల తీరుతెన్నులను, నాయకుల వ్యవహార శైలినీ ఎండగడుతున్నారు.

జనసేన పోరాట యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ సోమవారంనాడు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజవర్గాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు ఆయన నిడదవోలు గణేశ్ సెంటర్‌లో నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడతారు. నిడదవోలు సభ అనంతరం ఆయన తాడేపల్లిగూడెంలో పోరాట యాత్ర నిర్వహిస్తారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటలకు పెంటపాడు రోడ్డులో పెద్ద మార్కెట్ వద్ద జరిగే బహిరంగ సభలో జనవాహినిని ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు.