వరుసగా మూడో రోజూ పెట్రో ధర పెంపు

12 January, 2019 - 12:08 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: కొంత కాలంగా క్రమంగా తగ్గుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు గడచిన మూడు రోజులుగా మళ్ళీ పెరగడం మొదలుపెట్టాయి. శనివారం కూడా లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు, లీటర్ డీజిల్ ధర 29 పైసలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 69కు, డీజిల్ ధర రూ. 63.10కు పెరిగింది. ముంబైలో పెట్రోల్ ధర రూ.75, డీజిల్ ధర రూ. 66కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.73.41కి, డీజిల్ ధర రూ. 68.57కి పెరిగాయి.