సావిత్రి అనుకున్నారట..

16 May, 2019 - 7:39 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం సీత. ఈ చిత్రం మే 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్, ట్రైలర్‌కి అన్ని వర్గాల వారి నుంచి విశేష స్పందన వస్తుంది. ఈ చిత్రంలో సోను సూద్ కీలక పాత్రలో ఒదిగిపోయి నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రంపై ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి తొలుత సావిత్రి అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారట. కానీ ఆ తర్వాత ఈ చిత్ర కథ రామాయణాన్ని పోలి ఉండటంతో సీత అని పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో బాత్ టబ్ సీను ఉంటుందని అందులో హీరోయిన్ కాజల్.. దాదాపు 200 కేజీల ఐస్‌ను ఈ టబ్‌లో వేసుకుందట. ఈ చిత్రం మహిళా చిత్రంగా తెరకెక్కుతోంది.
Teja’s