15న తెనాలి రామకృష్ణ బీఏబీఎల్

06 November, 2019 - 5:53 AM

హాస్యరసంతో కూడిన కథలను వెండితెరకు ఎక్కించడంలో దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసిన చెయ్యి. ‘సీమశాస్త్రి’.. ‘సీమటపాకాయ్’.. ‘దేనికైనా రెడీ’ .. ‘ఈడోరకం ఆడోరకం’ చిత్రాలు నాగేశ్వరరెడ్డి మార్కుతో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో నవ్వించాయి. అలాంటి నాగేశ్వరరెడ్డి ఈ సారి కూడా పూర్తి వినోదాత్మకమైన కథనే తెరపై ఆవిష్కరించేందుకు రెడీ అయ్యాడు .. ఆ సినిమా టైటిల్ ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’.

సందీప్ కిషన్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో ఆయనకు జోడీగా హన్సిక నటించింది. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. ఈ నెల 15న ఈ మూవీని విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. తాజాగా ఒక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ‘నిను వీడని నీడను నేనే’ సినిమా ఫలితంతో ఊరట చెందిన సందీప్ కిషన్‌కి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూద్దాం.