టీఆరెస్‌కు సీపీఐ మద్దతు ఉపసంహరణ

15 October, 2019 - 8:02 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు సీపీఐ భారీ షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్‌కు ముందుగా ప్రకటించిన మద్దతును సీపీఐ ఉపసంహరించుకుంది. ఈ విషయం తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా మద్దతు ఉపసంహరించుకున్నట్టు ఆయన ప్రకటించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో చాడ మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది మంగళవారం ప్రకటిస్తామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యమంలో సీపీఐ అగ్రభాగంలో ఉండాలని నిర్ణయించామని అన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా కార్మికులను చర్చలకు పిలవాలని, వారి సమస్యలు పరిష్కరించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.