ఆసక్తి రేపుతున్న ‘సీత’

10 May, 2019 - 3:50 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రముఖ దర్శకడు తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగ ర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సీత’. ఈ చిత్ర ట్రైలర్‌ శుక్రవారం విడుదలైంది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ విడుదలై.. ఆసక్తిని కలగజేస్తే.. ఇవాళ విడుదలైన ట్రైలర్ ఆ ఆసక్తిని మరింత పెంచింది. కాంట్రాక్ట్ మ్యారేజ్ అనేది ప్రధాన కాథాంశంగా ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం సోనూసూద్ ప్రతినాయకుడి పాత్రలో ఒదిగిపోయి నటిస్తున్నారు.

నేనే రాజు నేనే మంంత్రి చిత్రానికి దర్శకత్వం వహించిన తేజ. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌కు దర్శకత్వం వహించారు. కానీ మొదట్లోనే ఆయన ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత తేజ.. సీత చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్‌లో నటిస్తుంది. ఇటీవలే ఈ పాట విడుదలై.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స స్వరాలు సమకురుస్తున్నారు. ఈ చిత్రం మే 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.