‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌‌’ని ఆపండి

12 March, 2019 - 6:38 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. అసలు కథ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో ఏపీ సీఎం చంద్రబాబును నెగెటివ్ పాత్రలో చూపుతున్నట్లు ఇప్పటికే విడుదలైన… టీజర్, ట్రైలర్‌తోపాటు పాటలను బట్టి అర్థమవుతోంది.

దీని ప్రభావం రానున్న ఎన్నికల్లో ఓటరుపై తీవ్ర ప్రభావం చూపనుందని ఇప్పటికే టీడీపీలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఆ క్రమంలో టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని (సీఈసీ) ఆశ్రయించారు.

ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోని సగటు ఓటరుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని.. దాంతో ఈ చిత్ర విడుదల ఏప్రిల్ 11వ తేదీ తర్వాత విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని.. సీఈసీని కలసి ఫిర్యాదు చేశారు. దాంతో దేవీబాబు చౌదరి చేసిన అభ్యర్థనను సీఈసీ పరిగణలోకి తీసుకుంది. ఆ క్రమంలో సదరు ఫిర్యాదును పరిశీలించాలంటూ… రాష్ట్ర ఎన్నికల ప్రధాని అధికారి గోపాల కృష్ణా దివ్వేదిని ఆదేశించింది.

దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా ఏప్రిల్ 11న తోలి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజునే తెలుగు రాష్ట్రాల్లోని లోక్ సభ స్థానాలతోపాటు.. ఏపీలోని అసెంబ్లీలోని 175 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి విషయం విదితమే.