ఎన్టీఆర్‌లో తమన్నా!

11 October, 2018 - 3:53 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ బయోపిక్ శరవేగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తండ్రి పాత్రలో ఒదిగిపోవడమే కాదు.. స్వయంగా ఈ చిత్ర నిర్మాతల్లో ఆయన ఒకరు.

ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం విదితమే. అయితే ఈ చిత్రంలో శ్రీదేవి పాత్రను రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఆ లుక్‌కు ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. శ్రీదేవి, జయప్రద తదితర హీరోయిన్లు ఎన్టీఆర్‌తో కలసి నటించి హిట్ పెయిర్‌గా నిలిచారు.

అయితే జయప్రద పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్నట్లు టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. మరి ఈ విషయం అధికారికంగా తెలియాలంటే చిత్ర యూనిట్ ప్రకటించే వరకు ఆగాల్సిందే. ఎన్టీఆర్‌ కథనాయుకుడు చిత్రం జనవరి 9 వ తేదీన, ఎన్టీఆర్‌ మహానాయకుడు జనవరి 24వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.