టైమ్ ఫిక్స్

13 August, 2019 - 7:13 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం సైరా నరసింహరెడ్డి. ఈ చిత్రం మేకింగ్ వీడియోను బుధవారం అంటే ఆగస్ట్ 14వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు విడుదల చేయనున్నట్లు సైరా చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం సైరా యూనిట్ విడుదల చేసింది.

కాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కొద్దిగా మిగిలి ఉందని… ఆ షూటింగ్ జరుపుకుంటూనే మరో వైపు డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. కోణిదెల ప్రోడక్షన్స్ బ్యానర్‌‌లో భారీ వ్యయంతో ఈ చిత్రం నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆక్టోబర్ 02న విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, అనుష్క శెట్టి, తమన్నా, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు నటించారు. తెలుగు, తమిళం, హిందీలో ఈ చిత్రం ఏక కాలంలో విడుదల కానుంది.