బ్రిటన్ పార్లమెంట్‌లో తెల్లపొడి కలకలం

13 March, 2018 - 12:57 PM

(న్యూవేవ్స్ డెస్క్)

లండన్‌: బ్రిటన్‌ పార్లమెంటులో వైట్‌ పౌడర్‌ కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు వైట్‌ పౌడర్‌‌‌తో ఉన్న రెండు లెటర్‌ ప్యాకెట్‌‌లను వెస్ట్‌‌మినిస్టర్‌ ఆఫీసులోకి పంపించారు. వాటిని తెరిచి చూడగా అందులో పౌడర్‌ ఉన్నట్లు తేలింది. రెండు లేఖల్లో పెట్టి దాన్ని పంపించారు. పలువురు బ్రిటన్‌ ఎంపీలు, వారీ ఆఫీసులు అక్కడే ఉండటంతో అధికారులు కంగారు పడ్డారు. అయితే.. ఆ పౌడర్‌‌ను పరీక్షించిన నిపుణులు ప్రమాదకరమైనది కాదని నిర్ధారించారు.

పార్లమెంట్‌కు వైట్ పౌడర్‌ పంపించడం వెనుక ఉగ్రవాద కోణం ఏదైనా ఉందేమోనని కౌంటర్‌ టెర్రరిజం కమాండ్‌ దర్యాప్తు ప్రారంభించింది. గతంలో రష్యా గుఢచారి కూడా ఇలాంటి పౌడర్‌‌లో విషం కలిపి ఉంచిన కారణంగా చనిపోయిన విషయం తెలిసిందే. ‘వెస్ట్‌‌మినిస్టర్‌ కార్యాలయాల్లో నుంచి ఏ ఒక్కరినీ ఖాళీ చేయించడం లేదు. అయితే, ఆ పౌడర్‌ ప్రభావం చూపుతుందనుకున్న ప్రదేశం మేరకు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ వివరాలు అందించలేం’ అని పార్లమెంటరీ అధికారిక ప్రతినిధి చెప్పారు.

ఈ సంఘటన జరిగిన వెంటనే తాము ఘటనా స్థలికి వెళ్లామని, ఓ మహిళను, వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లామని లండన్‌ అంబులెన్స్‌ సర్వీసు తెలిపింది.