సీనియర్‌ న్యాయవాది పీపీ రావు కన్నుమూత

13 September, 2017 - 2:53 PM


(న్యూవేవ్స్ డెస్క్)

ఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది పావని పరమేశ్వరరావు(84) కన్నుమూశారు. ఢిల్లీలోని ఇండియన్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ ఆయన బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పీపీ రావు స్వస్థలం ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్ల. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.