మమతా బెనర్జీ హత్యకు సుపారీ!?

12 May, 2018 - 12:36 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని సంచలన ఆరోపణ చేశారు. తనను అంతం చేసేందుకు ఓ రాజకీయ పార్టీ కిరాయి హంతకులను కూడా నియమించుకుందన్నారు. ‘నన్ను చంపేందుకు కుట్ర జరిగినట్టు నా దృష్టికి వచ్చింది. ఇందుకోసం ఓ పార్టీ సుపారీ కూడా ఇచ్చింది. అడ్వాన్స్ తీసుకున్న కిరాయి హంతకులు నా నివాసం, కార్యాలయం, ఇతర సమీప ప్రాంతాల్లో రెక్కీ కూడా నిర్వహించారు’ అంటూ ఓ జాతీయ చానల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ చెప్పారు.

కుట్రదారులు రోజూ తనను దూషిస్తూ ముందు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి, ఆ తర్వాత శాశ్వతంగా తనను తొలగించే ప్రణాళికతో ఉన్నారని మమతా బెనర్జీ చెప్పారు. అయితే.. తనకు ఇవి అలవాటైపోయాయని, గతంలో కూడా తనపై జరిగిన కుట్రల నుంచి ప్రాణాలతో బయపడ్డానన్నారు.