వైఎస్సార్ బయోపిక్‌లో సబితగా సుహాసిని!

15 June, 2018 - 11:48 AM

దివంగత ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ టైటిల్‌తో ఒక సినిమా నిర్మాణంలో ఉంది. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహీ వి. రాఘవ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సబితా ఇంద్రారెడ్డి పాత్రను సుహాసిని చేయనున్నారు. యాత్ర సినిమా లుక్‌ టెస్ట్‌ త్వరలోనే జరగనుంది.

మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ‘నా సోదరి’ అని వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ ఆప్యాయంగా చెప్పేవారు. అలాంటి ‘అన్న’కు ఎంతో ఇష్టంగా రాఖీ కట్టేవారు సబితా ఇంద్రారెడ్డి. వైఎస్‌ఆర్ హయాంలో తొలి మహిళా హోంమంత్రిగా సబిత బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

కాగా.. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలో వైఎస్‌ రాజశేఖరరెడ్డిగా మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు. వైఎస్‌ఆర్ గెటప్‌‌లో ఉన్న మమ్ముట్టి ఫస్ట్‌ లుక్‌‌కి అనూహ్య స్పందన కూడా లభించింది.